Breaking

Saturday, 24 October 2020

Telugu bible stories - ఏలియా - ఆహాబు

 


యెజెబెలు నాబోతును చంపించి అతని ద్రాక్ష తోటను రాజైన అహాబును స్వాధీనపరచుకొనమని చెప్పెను అందుకు ఆహాబు సంతోషముతో దానిని స్వాధీనపరచుకొనుటకు బయలుదేరెను

అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదు ర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను
నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగా-దీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా-ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను
అంతట అహాబు ఏలీయాను చూచి-నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను-యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.
అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను-నేను నీ మీదికి అపా యము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.
ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా-యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
​పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను
​తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.
​ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను.
​అహాబు ఆ మాటలు విని తన వస్త్ర ములను చింపు కొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా
​​యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
​​అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.
ప్రియులారా ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోట విషయములో పాపము చేసిన వాడాయెను అయినను దేవుని గద్ధింపును ఏలీయా ద్వారా విని తన హృదయములో బహు వేదన పడి దేవుని యొద్ద తనను తాను తగ్గించుకొని మొరపెట్టెను అందువలన అతను యెహోవా రప్పించు కీడును తప్పించుకుకొనెను దేవుడు ప్రేమామయుడు కృపామయుడు గనుక అహాబును క్షమించెను
ప్రియులారా మనం ఎటువంటి మూర్కపు మనస్సు గలవారమైనను దేవుని సన్నిధిలో మన తప్పులను ఒప్పుకొని మొరపెట్టినట్లైతే దేవుడు మనపై కృప చూపు వాడైయున్నాడు ఆయన మనలను పరిశుద్దులునుగా చేయుటకై సిలువలో తన ప్రాణములను సహితం అర్పించాడు
కనుక ఆయనకి ఇష్టమైన స్వభావము గల వారమై జీవిద్దాం

కంఠత వాక్యం :
​​అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలము నందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.
1రాజులు 21: 29

మీకొక ప్రశ్న :
యెజబెలును ఏ జంతువులు తినినవి ?



No comments:

Post a Comment